India vs England: లార్డ్స్ లో టీమిండియా, ఇంగ్లండ్ ఆటగాళ్ల లంచ్ మెనూ చూశారా...!

India vs England Players Lunch Menu at Lords
షార్ట్స్‌లో చూడండి
లార్డ్స్ లో టీమిండియా, ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు జరుగుతోంది. కాగా, రెండో రోజు ఆటకు సంబంధించిన ఆటగాళ్ల లంచ్ మెనూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మెనూ కార్డును లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ తన అఫిషియల్ సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. డే-2 మెనూ... అంటూ నోరూరించే వంటకాలను ఆటగాళ్లకు అందుబాటులో ఉంచినట్టు ఈ మెనూ చూస్తే అర్థమవుతోంది. చికెన్ మీట్ బాల్స్, కాడ్ చేపలు, రొయ్యలు, గొర్రె పిల్ల మాంసం, పనీర్ టిక్కా, బాస్మతి రైస్ వంటి మల్టీ క్యూజిన్ వంటకాలను ఇందులో చూడొచ్చు. 
  • బటర్ నట్ స్క్వాష్ సూప్
  • హ్యారిస్సా మ్యారినేటెడ్ చికెన్ మీట్ బాల్స్
  • మిసో మ్యారినేటెడ్ కాడ్ లోయిన్
  • లాంబ్ రైల్వే కర్రీ
  • పంప్కిన్ కుర్మా
  • పీ అండ్ మింట్ టార్టెల్లిని
  • పనీర్ టిక్కా
  • రొయ్యలు/మేరీ రోజ్ సాస్
  • బాస్మతి రైస్
  • క్రష్డ్ న్యూ పొటాటోస్
  • క్యారట్స్, ఫ్రెంచ్ బీన్స్, బ్రాకోలి
  • ఫ్రూట్ సలాడ్
  • గ్రీక్ యోగర్ట్
వంటి వంటకాలను ఈ మెనూలో పొందుపరిచారు. 
Go Back to Shorts
India vs England
India
England
Lords
Lords Cricket Ground
Test Match
Lunch Menu
Cricket
Food
Sports

More Telugu News