Revanth Reddy: తెలంగాణలో ఈ నెల 14న కొత్త రేషన్ కార్డుల పంపిణీ!

Revanth Reddy to Launch New Ration Card Distribution in Telangana on 14th
  • తుంగతుర్తిలో ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
  • రాష్ట్రవ్యాప్తంగా 2.4 లక్షల కొత్త రేషన్ కార్డుల పంపిణీ
  • 94,72,422కు చేరనున్న రేషన్ కార్డుల సంఖ్య
తెలంగాణ రాష్ట్రంలో నూతన రేషన్ కార్డులు జారీ ప్రక్రియ ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 14న తుంగతుర్తిలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా కొత్త రేషన్ కార్డుల జారీ నిలిచిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డుల జారీ కోసం దరఖాస్తులను స్వీకరించింది. ఇదివరకే కొంతమందికి రేషన్ కార్డులను ప్రభుత్వం అందజేసింది.

ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 2.4 లక్షల కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. దీని ద్వారా దాదాపు 11.30 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. గత ఆరు నెలల కాలంలో ప్రభుత్వం 41 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేసింది. తాజాగా పంపిణీ చేయనున్న వాటితో కలిపి రాష్ట్రంలో రేషన్ కార్డుల సంఖ్య 94,72,422కు చేరుకుంటుంది. వీటి ద్వారా మొత్తం 3.14 కోట్ల మందికి ప్రయోజనం కలగనుంది.
Revanth Reddy
Telangana
Ration Cards
New Ration Cards
Food Security
Tungaturthi

More Telugu News