Bandi Sanjay: బండి సంజయ్‌కు రాజాసింగ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు

Raja Singh Birthday Wishes to Bandi Sanjay
  • ఈరోజు బండి సంజయ్ 54వ పుట్టిన రోజు
  • శుభాకాంక్షలు తెలియజేసిన పలువురు నాయకులు, అభిమానులు
  • బండి సంజయ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన అమిత్ షా
కేంద్ర సహాయ మంత్రి, కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్‌కు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రోజు బండి సంజయ్ 54వ పుట్టినరోజు కావడంతో ఆయనకు పలువురు నాయకులు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. "కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్న గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు" అంటూ రాజాసింగ్ ట్వీట్ చేశారు.


కేంద్ర మంత్రి అమిత్ షా కూడా బండి సంజయ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ, భగవంతుడు మీకు దీర్ఘాయుష్షు, ఆరోగ్యం, ఆనందాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఇదే నిబద్ధతతో, ఉత్సాహంతో దేశానికి సేవను కొనసాగిస్తారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. అమిత్ షా 'ఎక్స్' వేదికగా శుభాకాంక్షలు తెలియజేయగా, బండి సంజయ్ ధన్యవాదాలు తెలుపుతూ రీట్వీట్ చేశారు.
Bandi Sanjay
Raja Singh
Amit Shah
Bandi Sanjay birthday
BJP
Karimnagar MP
Telangana BJP

More Telugu News