మా కుటుంబం క్యారెక్టర్ గురించి పవన్ కల్యాణ్ మాట్లాడినప్పుడు చాలా బాధపడ్డాం: జక్కంపూడి గణేశ్
- ఎన్నికల ప్రచారం సమయంలో పవన్ చేసిన వ్యాఖ్యలతో బాధపడ్డామన్న గణేశ్
- బెట్టింగ్ క్లబ్ లు, ల్యాండ్ మాఫియా మీద చేసిన ఆరోపణలను నిరూపించాలని డిమాండ్
- ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బాగోదని వ్యాఖ్య
తన అన్నయ్య జక్కంపూడి రాజాను జనసేనలోకి రావాలని కోరినట్టు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అవాస్తవాలు మాట్లాడుతున్నారని గణేశ్ మండిపడ్డారు. తప్పుడు ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు.