State Bank of India: కస్టమర్లకు ఆ ఆరు బ్యాంకులు శుభవార్త! ఆ ఖాతాల మినిమం బ్యాలెన్స్ ఛార్జీలు రద్దు

State Bank of India and other banks waive minimum balance charges
షార్ట్స్‌లో చూడండి
దేశంలోని కోట్లాది మంది బ్యాంకు ఖాతాదారులకు ఇది శుభవార్త. సేవింగ్స్ ఖాతాలలో కనీస నిల్వ (మినిమం బ్యాలెన్స్) లేకుంటే విధించే ఛార్జీలను పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు రద్దు చేశాయి. ఈ నిర్ణయంతో సాధారణ, మధ్య తరగతి ప్రజలపై ఆర్థిక భారం గణనీయంగా తగ్గనుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సహా మరిన్ని బ్యాంకులు ఈ జాబితాలో చేరాయి.

బ్యాంక్ ఆఫ్ బరోడా ఇటీవల జులై 1, 2025 నుంచి తమ సాధారణ సేవింగ్స్ ఖాతాలపై ఈ ఛార్జీలను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, ప్రీమియం ఖాతాలకు ఈ మినహాయింపు వర్తించదని స్పష్టం చేసింది. ఇదే బాటలో ఇండియన్ బ్యాంక్ కూడా జులై 7, 2025 నుంచి అన్ని రకాల పొదుపు ఖాతాలపై మినిమం బ్యాలెన్స్ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.

కెనరా బ్యాంక్ కూడా ఈ ఏడాది మే నెలలో సాధారణ సేవింగ్స్ ఖాతాలతో పాటు ఎన్ఆర్ఐ, శాలరీ ఖాతాలపై కూడా ఈ ఛార్జీని తొలగించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తమ వినియోగదారులకు ఊరటనిస్తూ ఇదే విధమైన నిర్ణయం తీసుకున్నాయి. దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కూడా గతంలోనే ఈ ఛార్జీలను రద్దు చేసింది. మారుతున్న మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా, ఖాతాదారులకు ఆర్థిక సౌలభ్యాన్ని పెంచే లక్ష్యంతో బ్యాంకులు ఈ నిర్ణయాలు తీసుకుంటున్నాయి.
Go Back to Shorts
State Bank of India
SBI
Bank of Baroda
Indian Bank
Canara Bank
Punjab National Bank

More Telugu News