YS Jagan: జగన్ కాన్వాయ్ నుంచి జారిపడ్డ వైసీపీ నేత

YSRCP Leader Falls from Jagan Convoy in Chittoor District
  • బంగారుపాళ్యంలో ఉద్రిక్తంగా మారిన జగన్ పర్యటన
  • అనుమతి లేకున్నా భారీ వాహనాలతో వైసీపీ శ్రేణుల రోడ్ షో
  • నియంత్రణకు పోలీసుల స్వల్ప లాఠీఛార్జ్
  • హెలిప్యాడ్ వద్ద తోపులాట, కాన్వాయ్ నుంచి జారిపడ్డ నేత
  • ఇది దండయాత్రలా ఉందంటూ టీడీపీ నేతల విమర్శలు
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటన తీవ్ర ఉద్రిక్తతకు, గందరగోళానికి దారితీసింది. వైసీపీ శ్రేణులు నిబంధనలను బేఖాతరు చేస్తూ భారీగా తరలిరావడంతో పలుచోట్ల తోపులాట జరిగింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు స్వల్పంగా లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది.

వివరాల్లోకి వెళితే, జగన్ పర్యటన సందర్భంగా రోడ్ షోకు ఎలాంటి అనుమతులు లేనప్పటికీ, వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. షరతులను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చిత్తూరు ఎస్పీ మణికంఠ ముందే హెచ్చరించినా వారు లెక్కచేయలేదు. బెంగళూరు నుంచి అరగొండ ఫ్లైఓవర్‌ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ వద్దకు జగన్ చేరుకోగానే గందరగోళం మొదలైంది. అక్కడ కేవలం 30 మందికే అనుమతి ఉండగా, వందలాది మంది ఒక్కసారిగా దూసుకురావడంతో తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో వైసీపీ నేత విజయానంద రెడ్డి కాన్వాయ్ వాహనం పైనుంచి జారిపడ్డారు.

అనంతరం బంగారుపాళ్యం మార్కెట్ యార్డులో జగన్‌తో సమావేశమయ్యేందుకు 500 మందికి పోలీసులు అనుమతించారు. కానీ, జగన్ రాకముందే వేలాదిగా కార్యకర్తలు యార్డులోకి చొచ్చుకెళ్లడంతో అక్కడ కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ పరిణామాలపై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రంగా స్పందించారు. ఇది రైతులను పరామర్శించే యాత్రలా కాకుండా, ఓ దండయాత్రలా ఉందని వారు విమర్శించారు. గతంలో సత్యసాయి, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో జరిగిన జగన్ పర్యటనల్లోనూ ఇలాంటి ఘటనలే పునరావృతం కావడం గమనార్హం.

YS Jagan
Jagan Chittoor district
YSRCP rally
Andhra Pradesh politics
Bangarupalem YSRCP
YS Jagan roadshow
Chittoor SP
YSRCP leader falls
TDP criticism
Andhra Pradesh news

More Telugu News