Anaswara Rajan: ఓటీటీకి మలయాళ రొమాంటిక్ మూవీ!

Mr  Mrs Bachelor Movie Update
  • అనశ్వర రాజన్ నుంచి మలయాళ మూవీ 
  • రొమాంటిక్ కామెడీ జోనర్లో సాగే కథ 
  • మే నెలలో థియేటర్లకు వచ్చిన సినిమా 
  • ఈ నెల 11 నుంచి మనోరమా మ్యాక్స్ లో         

మలయాళంలో ఇప్పుడు అనశ్వర రాజన్ కి విపరీతమైన క్రేజ్ ఉంది. అక్కడ ఆమె వరుస విజయాలను అందుకుంటూ వెళుతోంది. అలా ఆమె నుంచి ఇటీవల వచ్చిన సినిమానే 'మిస్టర్ అండ్ మిస్ బ్యాచిలర్'. దీపు కరుణాకరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, మే 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్స్ వైపు నుంచి యావరేజ్ మార్కులు తెచ్చుకుంది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో అడుగుపెట్టడానికి రెడీ అవుతోంది. 

అనశ్వర రాజన్ - ఇంద్రజిత్ సుకుమారన్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ఈ నెల 11వ తేదీ నుంచి 'మనోరమా మ్యాక్స్'లో స్ట్రీమింగ్ కానుంది. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ కూడా వచ్చేసింది. మలయాళ సినిమాల అనువాదాల కారణంగా ఇటు అనశ్వర రాజన్ - అటు ఇంద్రజిత్ సుకుమారన్ కూడా తెలుగు ప్రేక్షకులకు తెలుసు. అనశ్వర రాజన్ తెలుగులోను ఒకటి రెండు సినిమాలు కమిట్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. 

'మిస్టర్ అండ్ మిస్ బ్యాచిలర్' కథ విషయానికి వస్తే, కథానాయికకి తల్లిదండ్రులు ఒక పెళ్లి సంబంధాన్ని ఖాయం చేస్తారు. పెళ్లిపీటలు ఎక్కడానికి ముందు ఆ ఇంట్లో నుంచి ఆమె బయటపడుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఆమెకి ఒక 40 ఏళ్ల వ్యక్తి తారసపడతాడు. పెళ్లి ఆలోచన లేని అతనితో ఆమె పరిచయం ఏర్పడుతుంది. ఆ ఇద్దరి మధ్య పరిచయం ఏ తీరానికి చేరుకుంటుంది? అనేది కథ. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమా ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి మరి. 

Anaswara Rajan
Mr and Miss Bachelor
Malayalam movie
Indrajith Sukumaran
Manorama Max
OTT release
Romantic movie
Telugu audience
Deepu Karunakaran

More Telugu News