వైఎస్ స్మారకం కోసం సీఎం రేవంత్ కు షర్మిల విజ్ఞప్తి!
- తండ్రి జయంతి సందర్భంగా ఇడుపులపాయలో నివాళులు
- ఇదే అంశంపై సోనియా గాంధీకి లేఖ రాసినట్లు వెల్లడి
- రేవంత్ సర్కార్ తన అభ్యర్థనను నెరవేరుస్తుందని ఆశాభావం
ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ, ఆయన జ్ఞాపకాలు చిరస్థాయిగా నిలిచేలా హైదరాబాద్‌లో స్మారకాన్ని నిర్మించడం సముచితమని అన్నారు. హైదరాబాద్‌లో తన తండ్రి పేరు మీద స్మృతివనం నిర్మించాలని ఎప్పటినుంచో కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఈ అంశంపై ఇప్పటికే కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియా గాంధీకి లేఖ రాసినట్లు ఆమె వెల్లడించారు. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అభ్యర్థనను సానుకూలంగా పరిగణించి, స్మృతివనం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటారని షర్మిల ఆశాభావం వ్యక్తం చేశారు.