పాశమైలారం ఫ్యాక్టరీని పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి
- ఫ్యాక్టరీని గతంలో ఎప్పుడు తనిఖీ చేశారని అధికారులకు ప్రశ్న
- ప్రమాదానికి కారణంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశం
- సీఎంతో పాటు మంత్రులు వివేక్, శ్రీధర్ బాబు, రాజనర్సింహ, పొంగులేటి
ఈ రోజు ఉదయం సీఎం రేవంత్ రెడ్డి పోశమైలారం సిగాచీ ఫ్యాక్టరీ వద్దకు చేరుకున్నారు. ఆయనతో పాటు మంత్రులు వివేక్ వెంకటస్వామి, శ్రీధర్ బాబు, పొంగులేటి, దామోదర రాజనర్సింహ తదితరులు వెంట ఉన్నారు. అనంతరం ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించనున్నారు.