వానలో ఆడుకుంటానన్న కొడుకును పొడిచి చంపిన తండ్రి.. ఢిల్లీలో దారుణం
- వానలో ఆడుకుంటానని మారాం చేసిన పదేళ్ల బాలుడు
- కోపంతో కత్తితో పొడిచిన కసాయి తండ్రి
- ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతి
వద్దన్నా వినకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోయిన రాయ్ వంటగదిలోని కత్తితో బాలుడి ఎడమ పక్కటెముకల కింద పొడిచాడు. క్షణికావేశంలో ఈ దారుణానికి పాల్పడ్డ రాయ్.. ఆ తర్వాత వెంటనే కొడుకును ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. అయితే, గాయం కారణంగా అప్పటికే తీవ్ర రక్తస్రావం చికిత్స పొందుతూ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆసుపత్రి సిబ్బంది సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. రాయ్ పై హత్య కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నారు.