చెంగల్‌పట్టు ఎక్స్‌ప్రెస్‌లో భారీ దోపిడీ.. అనంతపురం జిల్లాలో సిగ్నల్ కట్ చేసి ప్రయాణికుల లూటీ!
- కోమలి స్టేషన్ దగ్గర సిగ్నల్ కేబుల్ కట్ చేసిన దుండగులు
- రైలు ఆపి బోగీలోకి చొరబడి ప్రయాణికుల బెదిరింపు
- నగదు, బంగారు ఆభరణాలు అపహరణ
- రేణిగుంట రైల్వే పోలీసులకు బాధితుల ఫిర్యాదు
- ముంబై నుంచి చెన్నై వెళ్తున్న రైలు
రైలు ఆగిన వెంటనే కొందరు దుండగులు రైలు బోగీల్లోకి ప్రవేశించి ప్రయాణికులను బెదిరించి వారి వద్దనున్న నగదు, బంగారు ఆభరణాలు దోచుకున్నారు. తెల్లవారుజామున జరిగిన ఈ హఠాత్ పరిణామంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దోపిడీ అనంతరం దుండగులు చీకటిలో పరారయ్యారు.
ఈ దోపిడీ ఘటన అనంతరం బాధిత ప్రయాణికులు రేణిగుంట రైల్వే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో రైలు ప్రయాణాల్లో ప్రయాణికుల భద్రతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.