చంద్రబాబు తరచూ వాడే హెలికాప్టర్ లో సాంకేతికలోపం... పర్యటన రద్దు చేసుకున్న కేంద్ర మంత్రి
- కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఏపీ పర్యటనలో అవాంతరం
- తిరుపతి నుంచి కృష్ణపట్నం వెళ్లే హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య
- సీఎం చంద్రబాబు కూడా ఇదే హెలికాప్టర్ వినియోగం
వివరాల్లోకి వెళితే, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం, ఆయన తిరుపతి నుంచి కృష్ణపట్నం పోర్టు సందర్శనకు వెళ్లాల్సి ఉంది. ఇందుకోసం అధికారులు ప్రత్యేక హెలికాప్టర్‌ను ఏర్పాటు చేశారు. అయితే, తిరుపతిలో హెలికాప్టర్ ఎక్కిన తర్వాత సాంకేతిక సమస్య ఉన్నట్లు సిబ్బంది గుర్తించారు.
ఈ విషయాన్ని కేంద్రమంత్రి భద్రతా సిబ్బందికి తెలియజేశారు. ప్రయాణానికి సురక్షితం కాదని భావించడంతో, పీయూష్ గోయల్ తన కృష్ణపట్నం పర్యటనను రద్దు చేసుకున్నారు. అనంతరం ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరిగి వెళ్లారు.