Air India: బాధిత కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఎయిరిండియా అదనపు సాయం
- అహ్మదాబాద్ విమాన ప్రమాద మృతుల కుటుంబాలకు ఎయిర్ ఇండియా అండ
- ఒక్కో కుటుంబానికి రూ. 25 లక్షల మధ్యంతర ఆర్థిక సాయం ప్రకటన
- ప్రాణాలతో బయటపడిన ప్రయాణికుడికి కూడా ఇదే మొత్తం
- టాటా సన్స్ ప్రకటించిన రూ. కోటి సాయానికి ఇది అదనం
- గురువారం జరిగిన ప్రమాదంలో 241 మంది దుర్మరణం
- క్షేత్రస్థాయిలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నామని వెల్లడి
అహ్మదాబాద్‌లో గురువారం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రయాణికుల కుటుంబాలకు అండగా నిలుస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఈ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 25 లక్షలు (సుమారు 21,000 బ్రిటిష్ పౌండ్లు) మధ్యంతర చెల్లింపుగా అందించనున్నట్లు శనివారం వెల్లడించింది. అలాగే ప్రాణాలతో బయటపడిన ఏకైక ప్రయాణికుడికి కూడా తక్షణ ఆర్థిక అవసరాల నిమిత్తం ఈ మేరకు రూ.25 లక్షలు అందించనున్నట్టు తెలిపింది. ఈ ఈ మేరకు ఎయిర్ ఇండియా తమ అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక ప్రకటన విడుదల చేసింది.
టాటా సన్స్ ఇప్పటికే ప్రకటించిన రూ. 1 కోటి సహాయానికి ఇది అదనమని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది. "ఇటీవల జరిగిన ప్రమాదంలో దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయిన ప్రయాణికుల కుటుంబాలకు ఎయిర్ ఇండియా సంఘీభావం తెలుపుతోంది. ఈ అత్యంత క్లిష్ట సమయంలో క్షేత్రస్థాయిలో మా బృందాలు సాధ్యమైనంత వరకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తున్నాయి" అని ప్రకటనలో పేర్కొంది.
గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం (ఏఐ171) కుప్పకూలింది. ఈ విమానంలో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉండగా, ఒక ప్రయాణికుడు మినహా మిగిలిన 241 మంది మరణించినట్లు ఎయిర్ ఇండియా ధృవీకరించింది. విమానం సమీపంలోని ఒక వైద్య కళాశాల ప్రాంగణంలో కూలిపోయిన విషయం తెలిసిందే. ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన ఏకైక ప్రయాణికుడి ఆరోగ్యం వేగంగా మెరుగుపడుతోందని సమాచారం.