Revanth Reddy: అల్లు అర్జున్, బాలకృష్ణను ఆలింగనం చేసుకున్న రేవంత్ రెడ్డి
- హైటెక్స్‌లో తెలంగాణ గద్దర్ సినీ అవార్డుల ప్రదానోత్సవం
- సీఎం రేవంత్ రెడ్డి, నటుడు అల్లు అర్జున్ మధ్య ఆత్మీయ పలకరింపు
- ఒకరినొకరు అభినందించుకుని, ఆలింగనం చేసుకున్న ఇరువురు
హైదరాబాద్‌లోని హైటెక్స్ ప్రాంగణంలో జరుగుతున్న తెలంగాణ గద్దర్ సినీ అవార్డుల ప్రదానోత్సవంలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా అల్లు అర్జున్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఇరువురూ నవ్వుతూ మాట్లాడుకోవడం, ఆలింగనం చేసుకోవడం వంటివి అందరి దృష్టిని ఆకర్షించాయి. పుష్ప-2 తొక్కిసలాట ఘటన, తదనంతర పరిణామాల నేపథ్యంలో వీరి భేటీ ఆసక్తిని రేకెత్తించింది.
తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సంయుక్తంగా ఈ అవార్డుల కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నాయి. ఇందుకోసం హైటెక్స్‌లో భారీ ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్, నందమూరి బాలకృష్ణ, దర్శకులు సుకుమార్, రాజమౌళి, నాగ్ అశ్విన్, నటుడు విజయ్ దేవరకొండ వంటి పలువురు సినీ ప్రముఖులు హాజరుకావడంతో ప్రాంగణమంతా సందడిగా మారింది.
హైటెక్స్ ప్రాంగణంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సీటులో కూర్చోవడానికి ముందు నందమూరి బాలకృష్ణను ఆలింగనం చేసుకొని షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆ తర్వాత అల్లు అర్జున్ వద్దకు వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఈ వేడుకలో రేవంత్ రెడ్డికి ఒక పక్కన బాలకృష్ణ, మరోవైపు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కూర్చున్నారు.