కేసీఆర్‌కు రెండో రోజూ ఏఐజీలో వైద్య పరీక్షలు
- మరోసారి ఏఐజీ ఆసుపత్రికి మాజీ సీఎం కేసీఆర్
- ఈరోజు కూడా కొనసాగిన వైద్య పరీక్షలు
- నిన్న శుక్రవారం కూడా గంటపాటు ఆసుపత్రిలోనే కేసీఆర్
- డాక్టర్ నాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఆరోగ్య పరీక్షలు
కేసీఆర్ నిన్న మధ్యాహ్నం కూడా ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఏఐజీ ఆసుపత్రికి వెళ్ళిన విషయం తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నం సుమారు 2:30 గంటలకు ఆసుపత్రికి వచ్చిన కేసీఆర్, దాదాపు గంటసేపు అక్కడే ఉన్నారు.
ఏఐజీ ఆసుపత్రి ఛైర్మన్, ప్రఖ్యాత గ్యాస్ట్రో ఎంటరాలజీ నిపుణులు డాక్టర్ నాగేశ్వరరెడ్డి పర్యవేక్షణలో కేసీఆర్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. కేసీఆర్‌కు ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు లేవని వైద్యులు తెలిపారు. అయితే, ఆయన తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారని సమాచారం.