నేడు అహ్మదాబాద్ కు వెళుతున్న మోదీ... విమాన ప్రమాద స్థలిని పరిశీలించనున్న పీఎం
- అహ్మదాబాద్ లో నిన్న కుప్పకూలిన ఎయిరిండియా విమానం
- దుర్ఘటనలో విమానంలోని 241 మంది మృతి
- మృతుల కుటుంబాలను పరామర్శించనున్న ప్రధాని మోదీ
ఈ భయానక ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న వారిలో ఒకే ఒక్క ప్రయాణికుడు స్వల్ప గాయాలతో అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడగా, మిగిలిన 241 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో గుజరాత్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ (68) కూడా మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. ఘటనపై ఇప్పటికే ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు దర్యాప్తు అనంతరం వెలుగులోకి రానున్నాయి.