Chandrababu Naidu: ఈ నెల 19న ఏపీ కేబినెట్ భేటీ

Chandrababu Naidu to Chair AP Cabinet Meeting on June 19
  • 19వ తేదీ ఉదయం 11 గంటలకు భేటీ కానున్న కేబినెట్
  • ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్
  • ప్రధాని మోదీ ఏపీ పర్యటన, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ తదితర కీలక అంశాలపై చర్చ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 19న జరగనుంది. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం మొదటి అంతస్తులో గల సమావేశ మందిరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ నేపథ్యంలో, 17వ తేదీ సాయంత్రం 4 గంటలలోపు అన్ని శాఖల కార్యదర్శులు కేబినెట్ సమావేశానికి సంబంధించిన ప్రతిపాదనలను సమర్పించాలని ఆదేశించారు. ఈ నెల 4న జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదం లభించింది.

కాగా, మంత్రివర్గ సమావేశాలను నెలకు రెండుసార్లు నిర్వహించాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. ఈ క్రమంలో ఈ నెలలో రెండవ సమావేశం 19వ తేదీన నిర్వహించనున్నారు. ఈ నెల 21న విశాఖలో నిర్వహించే ప్రపంచ యోగా దినోత్సవ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రానున్నందున, అందుకు ముందుగానే కేబినెట్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఈ కేబినెట్ సమావేశంలో ప్రధాన మంత్రి ఏపీ పర్యటన, రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులు, త్వరలో అమలు చేయనున్న తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు మొదలైన ముఖ్యమైన అంశాలపై చర్చించనున్నారు. 

.
Chandrababu Naidu
Andhra Pradesh Cabinet
AP Cabinet Meeting
Velagapudi Secretariat
Talli ki Vandanam
Annadata Sukhibhava
Narendra Modi
Visakhapatnam Yoga Day
AP Government Schemes
Andhra Pradesh News

More Telugu News