మసీదులో ఆరేళ్ల బాలికపై మౌల్వీ తండ్రి అఘాయిత్యం
- చాక్లెట్ ఆశచూపి బాలికను లోబరుచుకున్న దుండగుడు
- నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగింత
- జమాత్ కమిటీపై స్థానికుల ఆగ్రహం
- నిందితుడికి జ్యుడీషియల్ కస్టడీ
నిందితుడు 20 ఏళ్ల క్రితం ఉత్తరప్రదేశ్ నుంచి చిక్కబళ్లాపురానికి వలస వచ్చి స్థిరపడ్డాడని, ఫుట్‌పాత్‌పై బట్టల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఈ దారుణ ఘటన వెలుగులోకి రావడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడికి మసీదులో ఆశ్రయం కల్పించిన స్థానిక జమాత్ కమిటీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పోలీసులకు అప్పగించే ముందు బాధితురాలి తల్లి, స్థానికులు కలిసి నిందితుడికి దేహశుద్ధి చేశారు.