మరోసారి టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు
- మహానాడులో ఏకగ్రీవంగా ఎన్నిక
- ఇప్పటికే 30 ఏళ్లుగా అదే పదవిలో చంద్రబాబు
- మరో రెండేళ్ల పాటు ఆయనే అధ్యక్షుడు
పార్టీ అధ్యక్ష పదవికి చంద్రబాబు ఒక్కరే నామినేషన్ వేశారు. దీంతో ఆయనను జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లు పార్టీ నాయకత్వం ప్రకటించింది. ఆయన ఈ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగుతారు.
కాగా, చంద్రబాబు 1995లో తొలిసారి టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి గడిచిన మూడు దశాబ్దాలుగా ఆ పదవిలో కొనసాగుతున్నారు. 2014 రాష్ట్ర విభజన వరకు పార్టీ అధ్యక్షునిగా ఉన్న ఆయన.. ఆ తర్వాత జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
చంద్రబాబుకు పార్టీపై ఉన్న పట్టుదల, ప్రజల సమస్యలపై ఆయన చేస్తున్న కృషి, నాయకత్వ నైపుణ్యం ఇలా పలు అంశాలు ఆయనను మరోసారి అగ్రస్థానానికి చేర్చాయి. ఈ ఎన్నిక ద్వారా ఆయన నాయకత్వానికి పార్టీలో మద్దతు మరోసారి స్పష్టమైంది.