సౌదీలో పర్యటిస్తున్న ఎంపీల బృందంలో ఆజాద్ కు అస్వస్థత
--
ఎంపీ ఆజాద్ అస్వస్థతపై పాండా మీడియాతో మాట్లాడుతూ.. ఎంపీ గులాం నబీ ఆజాద్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని చెప్పారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని వివరించారు. కొన్ని పరీక్షలు చేయాల్సి ఉందని వైద్యులు చెప్పారన్నారు. బహ్రెయిన్, కువైట్ పర్యటనలో ఆయన ఎంతో కృషి చేశారని పాండా చెప్పారు. అయితే, సౌదీ అలాగే అల్జీరియాలలో నిర్వహించబోయే సమావేశాలకు ఆజాద్ హాజరుకాలేరని ఎంపీ పాండా పేర్కొన్నారు.