TG Bharat: ఆ వ్యక్తి రూ.100 కోట్లు ఇస్తా అన్నారు... అదీ ఫారెన్ లో చంద్రబాబు రేంజ్!: టీజీ భరత్

TG Bharat Says Individual Offered 100 Crore Seeing Chandrababus Reputation
  • కడపలో ఘనంగా టీడీపీ మహానాడు
  • తొలిరోజు వేదికపై ప్రసంగించిన ఏపీ మంత్రి టీజీ భరత్
  • చంద్రబాబు కష్టపడే లీడర్ అని కితాబు
  • మన దగ్గర చంద్రబాబు విలువ తెలియడంలేదని వ్యాఖ్య
  • కానీ, విదేశాల్లో ఆయనకు చాలా గొప్ప గుర్తింపు ఉందని వెల్లడి
ముఖ్యమంత్రి చంద్రబాబు విలువ మన దగ్గర సరిగా గుర్తించడం లేదని, కానీ విదేశాల్లో ఆయనకు ఎంతో గుర్తింపు ఉందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. కడపలో టీడీపీ రాష్ట్ర మహానాడు వేదికగా టీజీ భరత్ ఆసక్తికరంగా ప్రసంగించారు.

"సీఎం చంద్రబాబు గారు మన దగ్గర ఉంటే మనకు విలువ తెలియడం లేదు. బయటి దేశాల్లో ఆయన విలువ చాలా ఎక్కువ. నేను ఈ మధ్య ఇండియా టుడే కాంక్లేవ్ కోసం దుబాయ్ వెళ్లాను. శోభ బిల్డర్స్ అధినేత... సీఎం చంద్రబాబు గారికి పరిచయం లేదు, చూసింది లేదు, కలిసింది లేదు. ఓ సందర్భంలో మాట్లాడుతూ రూ.100 కోట్లు ఏపీకి విరాళంగా ఇవ్వాలనుకుంటున్నా అన్నారు. చంద్రబాబు లాంటి సరైన నాయకుడు మీకు ఉన్నాడు. ఆ రూ.100 కోట్లు ఏ విధంగా ఉపయోగించుకుంటారో వినియోగించుకోండని తెలిపారు. చంద్రబాబు గారు ఏ విధంగా కష్టపడుతున్నారో మనందరికి తెలియాలి. కష్టపడే లీడర్ మనకు ఉన్నారు. దీనిని మనం సద్వినియోగం చేసుకోవాలి" అని టీజీ భరత్ పేర్కొన్నారు.

గత ప్రభుత్వ విధానాల వల్ల పారిశ్రామిక వేత్తలు ఎంత బాధపడ్డారో అందరికీ తెలుసు. ఏపీలో పెట్టుబడులు పెట్టకండని ఫారెన్ కంపెనీలు మన ఏపీని బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. ఆ విధంగా గత వైసీపీ ప్రభుత్వ పాలన సాగింది. టీడీపీ ప్రభుత్వం వచ్చాక స్వాతంత్ర్యం వచ్చిందని కొందరు పారిశ్రామిక వేత్తలు నాతో చెప్పారు. మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ కంపెనీలకు చెందిన పారిశ్రామిక వేత్తలు వస్తే మనం ఎయిర్ పోర్ట్ కు వెళ్లి స్వాగతిస్తాం.. కానీ గత వైసీపీ హయాంలో పెట్టుబడిదారులను దారుణంగా అవమానించారు. గత ప్రభుత్వంలో టెక్స్ టైల్స్ పాలసీ ఇచ్చి గైడ్ లైన్స్ ఇవ్వలేదు. గైడ్ లైన్స్ మనం అధికారంలోకి వచ్చాక ఇచ్చాం. గత ప్రభుత్వంలో అంత ఘోరంగా పారిశ్రామిక వేత్తలను అవమానించారు. 

ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డుకు వైసీపీ హయాంలో 10 మందికే పరిమితం చేశారు. 2014-19 లో 60 మందితో పనిచేశాం.  నేడు దాదాపు 50 మంది పనిచేస్తున్నారు. మన విధానాలు ప్రమోట్ చేయడంలో ఈ బోర్డు పనిచేస్తుంది. ఇప్పుడు కూడా ఒక బోర్డు జపాన్ లో పర్యటిస్తోంది. మన ప్రభుత్వం వచ్చాక అన్ని పాలసీలు, గైడ్ లైన్స్ తీసుకొచ్చాం. 

చంద్రబాబు గారు ఎప్పుడు స్పీడ్ అప్ డూయింగ్ బిజినెన్స్ పై చెబుతారు. ఒక కంపెనీ ఏర్పాటు కావడం ఆలస్యం అయితే వడ్డీ ఎక్కువగా పెరిగిపోతుంది. ఉదాహరణకి కర్నూల్ లో ఉన్న జైరాజ్ స్టీల్స్ ప్రాజెక్ట్ ఆలస్యం కావడంతో కొన్ని కోట్లు వడ్డీలే సరిపోతుంది. రూ.9.40 లక్షల కోట్ల పెట్టుబడులు ఈ ఏడాదిలో మనం సాధించాం. రూ.1000 కోట్లు పెట్టుబడి పెట్టే కంపెనీ ఉంటే త్వరగా అనుమతులు ఇచ్చి పనులు ప్రారంభింపజేసేలా పాలన సాగిస్తున్నాం. 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయబోతున్నాం. ఇప్పటికే 11 ప్రారంభించాం. 39 పార్కులకు ఫౌండేషన్ వేశాం. 20 లక్షల ఉద్యోగాలు సాధించే దిశగా పనిచేస్తున్నాం. కాస్త ఓపికతో ఉండండి. కచ్చితంగా ఈ ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతాం" అని టీజీ భరత్ వివరించారు.
TG Bharat
Chandrababu Naidu
Andhra Pradesh
AP Industries
Investment AP
TDP Mahanadu
Shobha Builders
Economic Development Board
MSME Parks
Job Creation

More Telugu News