మరోసారి కలకలం... తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో చిరుత సంచారం
- వినాయకుడి ఆలయం సమీపంలో భక్తులకు కనిపించిన చిరుత
- ఫోటోలు, వీడియోలు తీసిన భక్తులు
- భక్తుల సమాచారంతో అక్కడికి చేరుకొని చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టిన అటవీ శాఖ అధికారులు
- భయాందోళనలకు గురైన భక్తులు
సమాచారం అందిన వెంటనే టీటీడీ సిబ్బంది, అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టారు. భక్తులను అప్రమత్తం చేశారు. సోమవారం ఉదయం అలిపిరి కాలినడక మార్గంలో చిరుత సంచరిస్తున్నట్లు గుర్తించిన భక్తులు టీటీడీ అధికారులకు తెలియజేశారు.