Hyderabad: హైదరాబాద్‌లో కరోనా కలకలం.. తాజాగా కేసు నమోదు కావడంతో అప్రమత్తమైన ఆరోగ్య శాఖ

Hyderabad Reports New Covid Case Health Department Alert
  • హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఓ డాక్టర్‌కు కరోనా
  • ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ వైద్యశాఖ ఆదేశం
  • ఢిల్లీలో 23 కొత్త కొవిడ్ కేసులు నమోదు
  • ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ సిద్ధం చేయాలని ఢిల్లీ సర్కార్ సూచన
ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి మళ్లీ విజృంభించే సూచనలు కనిపిస్తున్నాయి. దేశంలో గత కొన్ని రోజులుగా అక్కడక్కడా కొవిడ్ కేసుల గురించి వార్తలు వస్తుండగా, తాజాగా హైదరాబాద్‌లో ఒక కేసు నమోదైంది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ప్రాంతానికి చెందిన ఒక వైద్యుడికి కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ పరిణామంతో ప్రజలందరూ తగిన జాగ్రత్తలు పాటించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆ వైద్యుడి ఆరోగ్య పరిస్థితి, కాంటాక్ట్ ట్రేసింగ్ వివరాలపై అధికారులు దృష్టి సారించారు.

ఢిల్లీలోనూ పెరుగుతున్న కేసులు

దేశ రాజధాని ఢిల్లీలో కూడా కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా 23 కొత్త కొవిడ్ కేసులు నమోదైనట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆసుపత్రులలో పడకలు, ఆక్సిజన్, అవసరమైన మందులు, వ్యాక్సిన్లను సిద్ధంగా ఉంచుకోవాలని శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ప్రజలు కూడా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ, అనవసర ప్రయాణాలు మానుకోవాలని సూచించింది.
Hyderabad
Covid 19
Coronavirus
Telangana Health Department
Kukatpally
Delhi Covid Cases

More Telugu News