Rangaayana Raghu: అడుగడుగునా సస్పెన్స్ .. ఓటీటీలో కన్నడ క్రైమ్ థ్రిల్లర్!

Agnyathavasi  Kannada Movie Update
  • కన్నడలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ 
  • ప్రధానమైన పాత్రలో రంగాయన రఘు
  • ఏప్రిల్ 11న  విడుదలైన సినిమా 
  • ఈ నెల 28వ తేదీ నుంచి స్ట్రీమింగ్
  • తెలుగులోనూ అందుబాటులోకి 

సాధారణంగా క్రైమ్ థ్రిల్లర్ జోనర్ కి సంబంధించిన సినిమాలు మలయాళం నుంచి ఎక్కువగా వస్తుంటాయి. ఇక ఈ మధ్యనే ఈ జోనర్ వైపు కన్నడ మేకర్స్ శ్రద్ధ పెంచారు. అలా రూపొందిన సినిమానే 'అజ్ఞాతవాసి'. కృష్ణరాజ్ రాసిన కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. రంగాయన రఘు ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాను హేమంత్ రావు నిర్మించగా, జనార్ధన్ చిక్కన్న దర్శకత్వం వహించాడు.

ఈ ఏడాది ఏప్రిల్ 11వ తేదీన ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేశారు. సస్పెన్స్ తో కూడిన ఈ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ కి అక్కడ మంచి మార్కులే పడ్డాయి. దాంతో ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ద్వారా ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమైపోతోంది. ఈ నెల 28వ తేదీ నుంచి ఈ సినిమా 'జీ 5'లో కన్నడతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఇతర ముఖ్యమైన పాత్రలలో పావన గౌడ .. శరత్ లోహితస్య .. రవిశంకర్ గౌడ  కనిపించనున్నారు. 

కథ విషయానికి వస్తే .. ఒకప్పుడు ఆ ఊళ్లో అదే పనిగా పోలీస్ జీపులు తిరుగుతూ ఉండేవి. 1970లలో జరిగిన ఒక హత్యను మరిచిపోవడానికి ఆ ఊళ్లోవారికి చాలా కాలం పడుతుంది. పాతికేళ్లుగా ఆ ఊళ్లో ఏ ఒక్క నేరమూ జరగదు. గోవింద్ అనే పోలీస్ ఆ ఊళ్లో అడుగుపెట్టిన తరువాతనే, ఆ ఊరు పెద్దాయన మర్డర్ జరుగుతుంది. ఆ హత్య ఎవరు చేశారు? ఎందుకు చేశారు? ఈ కేసును గోవింద్ ఎలా ఛేదించాడు? అనేది కథ.

Rangaayana Raghu
Agnathavasi
Kannada crime thriller
ZEE5
murder mystery
suspense thriller
crime movie
Kannada movies
OTT release
Janardhan Chikkanna

More Telugu News