Sibiraj: ఓటీటీలో దూసుకుపోతున్న 'టెన్ అవర్స్'

10 Hours Movie Update
షార్ట్స్‌లో చూడండి
తమిళంలో శిబిరాజ్ ప్రధాన పాత్రధారిగా రూపొందిన సినిమానే ' టెన్ అవర్స్'. లతా బాలు నిర్మించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ కి ఇళయరాజా కలియ పెరుమాళ్ దర్శకత్వం వహించాడు. ఈ ఏడాది ఏప్రిల్ 18వ తేదీన ఈ సినిమాను విడుదల చేశారు. థియేటర్స్ నుంచి మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నెల 9వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కొనసాగుతోంది. 

గజరాజ్ .. దిలీపన్ .. జీవారవి ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి సుందర మూర్తి సంగీతాన్ని సమకూర్చాడు. శిబి సత్యరాజ్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ సినిమా, ఇప్పుడు ఓటీటీలో ఒక రేంజ్ లో దూసుకెళుతోందని అంటున్నారు. మొదటి నుంచి చివరివరకూ కథను ఎంగేజ్ చేస్తూ వచ్చిన తీరు అందరినీ ఆకట్టుకుంటోది. శిబి సత్యరాజ్ కి ఈ సినిమా మంచి మార్కులు తెచ్చిపెట్టిందని అంటున్నారు. 

జీవా అనే యువకుడు ఒక రాత్రివేళ ట్రావెల్స్ బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటాడు. అందరూ మంచి నిద్రలో ఉన్నవేళ అతన్ని ఎవరో హత్య చేస్తారు. దాంతో ఆ మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ కోసం పోలీస్ ఆఫీసర్ రంగంలోకి దిగుతాడు. జీవా ఎవరు? అతణ్ణి ఎవరు హత్య చేస్తారు? అందుకు గల కారణాలు ఏమిటి? ఈ కేసు విషయంలో పోలీస్ ఆఫీసర్ కి ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి? అనేది కథ. త్వరలోనే ఈ సినిమా తెలుగులోనూ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. 

Go Back to Shorts
Sibiraj
Ten Hours
Amazon Prime
Tamil Movie
Action Thriller
Ilayaraja Kaliyaperumal
Lata Balu
OTT Release
Indian Cinema
Mystery Thriller

More Telugu News