తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు
అనంతరం ఆలయంలో శ్రీవారి సేవలో పాల్గొని, మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో పండితులు వారికి వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
మరోవైపు భారత జట్టు మాజీ క్రికెటర్, హెడ్ కోచ్ గౌతం గంభీర్ కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. వేకువజామున స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. అలాగే మాజీ ప్రధానమంత్రి హెచ్‌డీ దేవెగౌడ, కేంద్రమత్రి ప్రహ్లాద్ జోషి కూడా వేర్వేరుగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.