Minister Nadeendla Manohar: దేశంలో మొదటిసారిగా తడి చెత్త, పొడి చెత్త సేకరణను తెనాలి మున్సిపాలిటీ ప్రారంభించడం గర్వకారణం: మంత్రి నాదెండ్ల

Minister Nadeendla Participates in Tenalis Swarnandra Swachhanda Program
  • తెనాలిలో వివిధ కార్యక్రమాలను పరిశీలించిన మంత్రి నాదెండ్ల
  • ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ వారి సమస్యలు తెలుసుకున్న వైనం
  • స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపు
భారతదేశంలో మొట్టమొదటిసారిగా తడి చెత్త, పొడి చెత్త వేర్వేరు సేకరణను తెనాలి మున్సిపాలిటీ ప్రారంభించడం గర్వకారణం అని రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర సంకల్పంలో భాగంగా ఈరోజు తెనాలిలో 'స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర' కార్యక్రమాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులతో కలిసి చేపట్టారు. 

స్వర్ణాంధ్ర -స్వచ్ఛఆంధ్ర  కార్యక్రమంలో భాగంగా  ఈరోజు ఉదయం 7 గంటలకు  తెనాలి పట్టణం బుర్రిపాలెం రోడ్ లోని శివాజీ చౌక్ వద్ద నుండి బయలుదేరి రాముల వారి గుడి మీదుగా మహాత్మా గాంధీ కూరగాయల మార్కెట్ వరకు మున్సిపల్ అధికారులు మరియు సిబ్బంది చేపడుతున్న వివిధ పారిశుద్ధ్య కార్యక్రమాలను మంత్రి నాదెండ్ల పరిశీలించారు. అవ్వ తాత, అమ్మ ఎలా ఉన్నారు అంటూ మంత్రి ప్రతి ఒక్కరిని పలకరిస్తూ వారి సమస్యలను శ్రద్ధగా విన్నారు.. 

తెనాలి పట్టణం బండ్లమూడి వారి వీధి లో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి మంత్రి స్వయంగా సైడ్ కాలువలోని చెత్తను తొలగించారు. మహాత్మా గాంధీ కూరగాయల మార్కెట్ మరియు చెంచుపేటలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాల వద్ద నుండి శ్రీ కొడాలి వీరయ్య మున్సిపల్ పార్క్ మీదుగా రావి టవర్స్ వరకు మున్సిపల్ సిబ్బంది చేపడుతున్న వివిధ పారిశుద్ధ్య కార్యక్రమాలను మంత్రి పరిశీలించారు. 

ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మాట్లాడుతూ, ప్రతి నెల మూడవ శనివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజల్లో పారిశుద్ధ్యంపై అవగాహన పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ప్రజలు, ప్రభుత్వ భాగస్వామ్యంతో అందరం కలిసికట్టుగా చేసే స్వచ్ఛంద కార్యక్రమం అన్నారు

ప్రతి ఒక్కరూ బాధ్యతతో స్వచ్ఛంద కార్యక్రమంలో పాల్గొనాలి మంత్రి పిలుపునిచ్చారు. పారిశుద్ధ్య పై అవగాహన పెంచుకోవాలని... మన గ్రామం మన పట్టణం స్వచ్ఛంగా ఉంచుకునేలా ప్రతి ఒక్కరు ఈ డ్రైవ్ లో పాలుపంచుకోవాలన్నారు. అందరం కలిసికట్టుగా మన పట్టణాన్ని, మన నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుకోవాలన్నారు. 

పట్టణంలోని డంపింగ్ యార్డ్ ను సంవత్సరాల నుంచి నిర్లక్ష్యంగా వదిలేశారని, దాన్ని అక్కడ నుంచి తరలించేందుకుగాను ప్రతిరోజు 75 నుంచి 95 మెట్రిక్ టన్నుల తడి పొడి చెత్త విడివిడిగా సేకరించి, తరలించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు.ప్రభుత్వ అధికారులు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలన్నారు.ప్రజల సమస్యలు తెలుసుకునే ఉద్దేశ్యంతో ప్రతి వారంలో ఒక్కో సచివాలయం పరిధిలో అధికారులు ఇంటింటికీ వెళ్లాలని, వారికి మార్గదర్శనం చేయాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. 

దోమలు, వీధి కుక్కల సమస్య లేకుండా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. గతంలో ఇంటి నిర్మాణం కోసం 50,000 నుంచి 3 లక్షల రూపాయలు ఇచ్చి ఇబ్బంది పడుతున్న లబ్ధిదారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కాంట్రాక్టులపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించడం జరిగిందన్నారు. ముంపు ప్రాంతాల్లో వర్షాకాలానికి ముందు చర్యలు తీసుకోవాలని, రోడ్ల నిర్మాణం సైడ్ కాలువలు నిర్మాణ పనులు ప్రారంభించామన్నారు.

చెత్త నుంచి సంపద సృష్టించడం ద్వారా సర్క్యులర్ ఎకానమీ సాధ్యం అవుతుందని వెల్లడించారు. స్వర్ణాంధ్ర-2047 సంకల్పంలో భాగంగా స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ప్రతి నెలా 3వ శనివారం రోజు జరుపుకుంటున్నామని స్పష్టం చేశారు. ప్రతి కార్యక్రమం స్ఫూర్తివంతంగా ఉండేందుకు నెల నెలా ఒక్కో థీమ్ ఎంచుకుని నిర్వహిస్తామని మంత్రి నాదెండ్ల పేర్కొన్నారు. మార్పు ఒక్క రోజు కోసం కాదని  నిరంతరం ప్రక్రియలా కొనసాగాలన్నారు.

ఎక్కడికక్కడ ఈ-వేస్ట్ సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులకు మంత్రి నాదెండ్ల సూచించారు.  రెడ్యూస్, రీయూజ్, రీ సైకిల్ అనేది ఈ - వేస్ట్ కలెక్షన్ సెంటర్ల నినాదం కావాలని పిలుపునిచ్చారు. 
Minister Nadeendla Manohar
Swarnandra-Swachhanda
Tenali Municipality
Waste Management
Andhra Pradesh
Cleanliness Drive
Circular Economy
E-waste Management
Municipal Solid Waste
Swachh Bharat

More Telugu News