Airtel: బ్లాక్ ప్లాన్ ను సవరించిన ఎయిర్ టెల్... రూ.399కే చానళ్లు, ఇంటర్నెట్!

Airtel Revises Block Plan Channels and Internet for Rs 399
  • వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పిన టెలికాం సంస్థ ఎయిర్‌టెల్
  • ఇప్పటి వరకూ ఐపీటీవీ ప్లాన్ ధరలు రూ.699 నుంచి ప్రారంభం
  • ఇకపై ఐపీటీవీ సేవలు రూ.399ల నుంచే మొదలు
ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ వినియోగదారులకు శుభవార్త తెలిపింది. తన బ్లాక్‌ప్లాన్‌ను సవరించింది. ఇకపై రూ.399ల నుంచే ఐపీటీవీ సేవలను అందించేందుకు నిర్ణయం తీసుకుంది. డేటా, డీటీహెచ్ ప్రయోజనాలు, ల్యాండ్ లైన్ నుంచి అపరిమిత కాల్స్ చేసుకునే సదుపాయాన్ని అందించనుంది. ఇప్పటి వరకూ ఐపీటీవీ ప్లాన్ల ధరలు రూ.699 నుంచి ప్రారంభం అవుతుండగా, ఇకపై రూ.399ల నుంచే (జీఎస్టీ అదనం) అందిస్తోంది.

ఎయిర్‌టెల్ ఈ ఏడాది మార్చి నుంచే దేశ వ్యాప్తంగా 2వేల నగరాల్లో ఐపీటీవీ సేవలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా తమ ఎంట్రీ లెవెల్ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ రూ.399కు సవరణ చేయడంతో పాటు ఐపీటీవీ సేవలను జత చేసింది. ఈ ప్లాన్ పై 10 ఎంబీపీఎస్ వేగంతో బ్రాడ్ బ్యాండ్ సేవలు లభిస్తాయి. ఎఫ్‌యూపీ (3,300 జీబీ వరకు) పరిమితి తర్వాత ఇంటర్నెట్ వేగం 1 ఎంబీపీఎస్‌కు తగ్గుతుంది. ఈ ప్లాన్‌లో 260 టీవీ ఛానెళ్లు ఉచితంగా లభిస్తాయి. ఇందులో ఎలాంటి ఓటీటీ ప్రయోజనాలు లభించవు.

ఓటీటీ ప్రయోజనాలు లేకుండా కేవలం తక్కువ వేగంతో బ్రాడ్ బ్యాండ్, ఐపీటీవీ సేవలు కోరుకునే వారు రూ.399 ఎంపిక చేసుకోవచ్చు. అయితే ఎక్కువ వేగంతో కూడిన డేటా, ఓటీటీ ప్రయోజనాలు కావాలంటే మాత్రం రూ.699, రూ.899, రూ.1199, రూ.1599 వంటి ప్లాన్‌లు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. 
Airtel
Airtel broadband plans
Airtel IPTV
IPTV services
Broadband plans
Rs 399 plan
Data plans
DTH services
Unlimited calls
TV channels

More Telugu News