Virat Kohli: కోహ్లీ రిటైర్మెంట్పై సెహ్వాగ్, గంభీర్ స్పందన
- టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ
- 14 సంవత్సరాల సుదీర్ఘ ఫార్మాట్ కెరీర్‌కు ముగింపు
- సోమవారం అధికారికంగా వీడ్కోలు నిర్ణయం వెల్లడి
- స్పందించిన ఐసీసీ, ప్రస్తుత, మాజీ క్రికెటర్లు
భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 14 సంవత్సరాల పాటు టెస్ట్ క్రికెట్లో అప్రతిహత సేవలందించిన కోహ్లీ... సోమవారం తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. ఈ అనూహ్య పరిణామంపై బీసీసీఐ, ఐసీసీ సహా పలువురు ప్రస్తుత, మాజీ క్రికెటర్లు సామాజిక మాధ్యమం వేదికగా స్పందించారు. కోహ్లీ అసాధారణ కెరీర్‌ను, టెస్ట్ క్రికెట్‌కు అతడు అందించిన సేవలను కొనియాడారు.
మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందిస్తూ, "విరాట్‌కు అభినందనలు. నిన్ను చూసినప్పటి నుంచి నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివని తెలుసు. టెస్ట్ క్రికెట్ ఆడిన తీరు, అందులో నీవు చూపిన ఉత్సాహం చూడటానికి చాలా ఆనందంగా ఉంది. నువ్వు టెస్ట్ క్రికెట్‌కు గొప్ప రాయబారివి. వన్డే క్రికెట్లో నీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను" అని అన్నాడు. ప్రస్తుత కోచ్ గౌతమ్ గంభీర్ తనదైన శైలిలో, "సింహంలాంటి మనిషీ.. నేను నిన్ను మిస్సవుతున్నా...!" అని రాసుకొచ్చాడు.
ఐసీసీ కూడా కోహ్లీ నిర్ణయంపై స్పందిస్తూ, "విరాట్ టెస్టు జట్టు నుంచి వైదొలగినా... అతడి కిరీటం చెక్కుచెదరలేదు. కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికి, సాటిలేని వారసత్వాన్ని మిగిల్చాడు" అని వ్యాఖ్యానించింది.