రేపు ఓటీటీకి వస్తున్న తెలుగు సినిమాలివే!
- సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా 'జాక్'
- ఈ నెల 8 నుంచి నెట్ ఫ్లిక్స్ లో
- ప్రదీప్ హీరోగా రూపొందిన లవ్ స్టోరీ
- ఈ నెల 8 నుంచి ఈటీవీ విన్ లో
అలాంటి ఈ సినిమా ఇప్పుడు 'నెట్ ఫ్లిక్స్' ద్వారా పలకరించడానికి రెడీ అవుతోంది. ఈ నెల 8వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారు. తెలుగుతో పాటు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో ఈ సినిమాను అందుబాటులోకి తీసుకురానున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా వదిలారు. 30 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకి, థియేటర్స్ వైపు నుంచి ఆశించిన రెస్పాన్స్ రాలేదు. ఇక ఓటీటీ వైపు నుంచి ఎన్ని మార్కులు తెచ్చుకుంటుందనేది చూడాలి.
ఇక ప్రదీప్ హీరోగా చేసిన 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమా, ఈ నెల 8వ తేదీ నుంచి 'ఈటీవీ విన్' లో స్ట్రీమింగ్ కానుంది. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను వదిలారు. భరత్ - నితిన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో, కథానాయికగా 'దీపిక' పరిచయమైంది. ఏప్రిల్ 11వ తేదీన థియేటర్స్ కి వచ్చిన ఈ సినిమా, ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమా ఎంతవరకూ కనెక్ట్ అవుతుందో చూడాలి.