Falcon Passport: పాస్ పోర్ట్ తీసుకుని విమానాల్లో విహరిస్తున్న డేగ.. వీడియో ఇదిగో!

Falcon with Passport Travels on a Plane
  • అబుదాబి విమానాశ్రయంలో ఓ వ్యక్తి డేగతో ప్రయాణం
  • విమానం క్యాబిన్‌లో యజమానితో పాటు డేగ జర్నీ
  • డేగకు ప్రత్యేక పాస్‌పోర్ట్.. వివరాలు వెల్లడించిన యజమాని
  • ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ గా మారిన వీడియో
ఆకాశంలో స్వేచ్ఛగా విహరించే పక్షులకు పాస్ పోర్ట్ తో పనేముంటుంది..? ఎంచక్కా ఎగురుకుంటూ ఎక్కడికైనా వెళ్లిపోతాయి. అయితే, అబుదాబిలో మాత్రం ఓ పెంపుడు డేగ తన యజమానితో పాటు విమానాల్లో ప్రయాణిస్తోంది. ఈ డేగకు ప్రత్యేకంగా పాస్ పోర్ట్ కూడా ఉండడం విశేషం. తాజాగా మొరాకో వెళ్లేందుకు అబుదాబి ఎయిర్ పోర్ట్ కు వచ్చిన ఓ ప్రయాణికుడి చేతిలో ఈ డేగ కనిపించింది. దీంతో అక్కడున్న ఓ ప్రయాణికుడు ఆ డేగ యజమానితో మాటలు కలిపాడు. డేగను విమానంలో తీసుకువస్తున్నారా అని అడగగా అవునని జవాబిచ్చిన సౌదీ వ్యక్తి.. డేగకు ప్రత్యేకంగా పాస్ పోర్ట్ కూడా తీశానని చెప్పాడు. 

పాస్‌పోర్ట్ లో ఆ డేగ లింగం, పుట్టిన దేశం, ఇంతకు ముందు సందర్శించిన ప్రదేశాల వివరాలు ఉన్నాయి. "ఇది మగ పక్షి, స్పెయిన్‌కు చెందినది" అని ఆ పాస్‌పోర్ట్‌లోని వివరాలను యజమాని చదివి వినిపించాడు. ఇది చూసి ఆ ప్రయాణికుడు "ఇది చాలా అసాధారణం" అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఈ సంభాషణకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. ఇప్పటివరకు 1.6 మిలియన్లకు పైగా నెటిజన్లు ఈ వీడియోను చూసి లైకులు, కామెంట్లు పెడుతున్నారు. కొందరు నెటిజన్లు తమకంటే ఆ డేగ మెరుగైన జీవితాన్ని గడుపుతోందని సరదాగా వ్యాఖ్యానించారు. యూఏఈ సంపన్నుల విలాసవంతమైన జీవనానికి ఇది నిదర్శనమని మరికొందరు పేర్కొన్నారు.
Falcon Passport
Abu Dhabi Airport
Viral Video
Pet Falcon
UAE Luxury Lifestyle
Passport for Animals
Travel with Pets
Saudi Arabian Owner
Spain Falcon
Instagram Viral

More Telugu News