అమరావతి సభకు పోటెత్తిన జనాలు... నిండిపోయిన సభాస్థలి ప్రాంగణం
- అమరావతిలో రాజధాని పనుల పునఃప్రారంభ వేడుక
- ఉదయం నుంచే భారీగా తరలి వచ్చిన జన సందోహం
- కిక్కిరిసిన సభా ప్రాంగణం, గ్యాలరీలు
కార్యక్రమం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం వద్దకు ప్రజలు పెద్ద ఎత్తున చేరుకోవడంతో అక్కడి గ్యాలరీలన్నీ పూర్తిగా నిండిపోయాయి. వేడుకకు హాజరైన వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. తాగునీరు, తాత్కాలిక ఆసుపత్రి, అంబులెన్సులను అందుబాటులో ఉంచింది.
సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా విశేషంగా ఆకట్టుకున్నాయి. కళాకారుల ప్రదర్శనలు సభికులలో ఉత్సాహాన్ని నింపాయి. రాజధానిగా అమరావతి ప్రస్థానాన్ని పునఃప్రారంభించే ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.