Botsa Satyanarayana: సింహాచలం ప్రమాద స్థలిని పరిశీలించిన బొత్స బృందం
- సింహాచలం ఆలయం వద్ద గోడ కూలిన ఘటనలో ఏడుగురు మృతి
- ప్రమాద స్థలిని పరిశీలించిన బొత్స, గుడివాడ అమర్ నాథ్ తదితరులు
- ఆలయ అధికారుల నుంచి వివరాలు సేకరించిన దర్యాప్తు కమిటీ
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయం వద్ద గోడ కూలి ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయిన ఘటన అందరినీ కలచివేసింది. తాజాగా ప్రమాద స్థలిని వైసీపీ మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్ నాథ్ సహా పలువురు వైసీపీ నేతలు పరీశీలించారు. ప్రమాదం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
కాగా, ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ కూడా ఘటనా స్థలిని పరిశీలించింది. అధికారుల నుంచి వివరాలను సేకరించింది.
మరోవైపు, మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 25 లక్షలు ప్రకటించింది. పీఎం సహాయనిధి నుంచి కూడా రూ. 2 లక్షల చొప్పున ప్రకటించారు.