Nani: నాని 'హిట్ 3' సినిమా టికెట్ ధ‌ర‌ల పెంపు.. ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్న‌ల్‌

AP Govt Allows Ticket Price Hike TO Nanis Hit 3
  • నాని, శ్రీనిధి శెట్టి జంటగా శైలేష్ కొలను దర్శకత్వంలో 'హిట్ 3'
  • రేపు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న సినిమా
  • మూవీ టికెట్ ధ‌ర‌ల పెంపు.. ఏప్రీ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు 
  • సింగిల్ స్క్రీన్ థియేట‌ర్ల‌లో టికెట్‌పై రూ. 50 
  • మ‌ల్టీప్లెక్సుల్లో రూ. 75 పెంచుకునేందుకు అనుమ‌తి
నేచురల్ స్టార్ నాని, శ్రీనిధి శెట్టి జంటగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'హిట్ 3'. హిట్ సిరీస్‌లో భాగంగా వస్తున్న మూడో చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. ఈ సినిమా రేపు (మే 1న‌) ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. అయితే, ఈ మూవీకి ఏపీ ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. టికెట్ ధ‌ర పెంపున‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఈ మేర‌కు తాజాగా ఉత్త‌ర్వులు జారీ చేసింది. 

సింగిల్ స్క్రీన్ థియేట‌ర్ల‌లో టికెట్‌పై రూ. 50 (జీఎస్‌టీతో క‌లిపి), మ‌ల్టీప్లెక్సుల్లో రూ. 75 (జీఎస్‌టీతో క‌లిపి) పెంచుకునేందుకు అనుమ‌తి ఇచ్చింది. ఈ పెరిగిన ధ‌ర‌లు వారం రోజుల పాటు అమ‌లులో ఉంటాయ‌ని ఉత్త‌ర్వుల‌లో పేర్కొంది. 

ఇక‌, ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమా, యునాన్మిస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. మిక్కి జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవ‌లే సెన్సార్ పూర్తి చేసుకున్న హిట్ 3కు సెన్సార్ బోర్డు ఏ స‌ర్టిఫికేట్ జారీ చేసింది. 2.37 గంట‌ల ర‌న్‌టైమ్‌తో సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.  
Nani
Hit 3
Hit 3 movie tickets price hike
Andhra Pradesh government
Tollywood
Telugu cinema
Hit 3 release
Nani Hit 3
SriNidhi Shetty
AP Government Green Signal for Hit 3 Ticket Price Hike

More Telugu News