వైసీపీ శింగనమల నియోజకవర్గ కోఆర్డినేటర్ గా సాకే శైలజానాథ్ ను నియమించిన జగన్
- ఈ ఏడాది ఫిబ్రవరి 7న వైసీపీలో చేరిన సీనియర్ నేత సాకే శైలజానాథ్
- వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరిక
- వైఎస్ఆర్ హయాంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన శైలజానాథ్
- 2022లో పీసీసీ అధ్యక్షుడుగా బాధ్యతలు నిర్వహణ
సీనియర్ నాయకుడైన సాకే శైలజానాథ్ శింగనమల రిజర్వుడ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండుసార్లు, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. వైఎస్ఆర్ హయాంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత 2014, 2019, 2024 ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు.
2022 జనవరి నుంచి అదే ఏడాది నవంబర్ వరకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడిగానూ బాధ్యతలు నిర్వహించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 7వ తేదీన ఆయన వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో శైలజానాథ్‌ను పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తగా జగన్ నియమించారు.