Vaibhav Suryavanshi: 14 ఏళ్ల సూర్యవంశీ తుపాన్ ఇన్నింగ్స్‌తో నమోదైన సరికొత్త రికార్డులు ఇవే!
- ఆర్ఆర్ యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ మెరుపు శతకం
- 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. 35 బంతుల్లోనే సెంచరీ
- ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారత ఆటగాడు
- ఐపీఎల్‌లో శతకం బాదిన అతి పిన్న వయస్కుడిగా వైభవ్
- టీ20 ఫార్మాట్‌లో సెంచరీ బాదిన అతి పిన్న వయస్కుడు
- టీ20 క్రికెట్‌లో అర్ధశతకం చేసిన యంగెస్ట్ ప్లేయర్
14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్‌లో అరంగేట్రం చేయడమే ఓ సంచలనమైతే... తన ఆరంభ సీజన్‌లోనే అదరగొట్టడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఐపీఎల్‌లో తాను ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా మలిచి, తన ఉద్దేశం ఏంటో చాటిన ఈ చిచ్చరపిడుగు... నిన్న రాత్రి గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన ఈ రాజస్థాన్ ప్లేయర్... 35 బంతుల్లోనే శతకం పూర్తి చేయడం విశేషం. తద్వారా తన ఈ తుపాన్ ఇన్నింగ్స్‌తో పలు రికార్డులను బ్రేక్ చేశాడు.
- ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన భారత ఆటగాడు. ఇంతకుముందు ఈ రికార్డు యూసుఫ్ పఠాన్ (37 బాల్స్) పేరిట ఉండేది. అలాగే ఐపీఎల్ హిస్టరీలో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ వైభవ్‌దే. ఓవరాల్‌గా క్రిస్ గేల్ 30 బంతుల్లో శతకం బాది ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.
- సూర్యవంశీ ఐపీఎల్ చరిత్రలో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడు (14 సంవత్సరాల 32 రోజులు) కూడా. మనీశ్ పాండే (19 సంవత్సరాల 253 రోజులు) ను అధిగమించాడు.
- అలాగే టీ20 ఫార్మాట్‌లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా (14 సంవత్సరాల 32 రోజులు) నిలిచాడు. 2013లో సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ వెస్ట్ జోన్ మ్యాచ్‌లో ముంబయిపై 18 సంవత్సరాల 118 రోజుల వయసులో శతకం చేసిన మహారాష్ట్రకు చెందిన విజయ్ జోల్ రికార్డును సూర్యవంశీ బద్దలు కొట్టాడు.
- టీ20 క్రికెట్‌లో అర్ధశతకం చేసిన యంగెస్ట్ ప్లేయర్ (14 సంవత్సరాల 32 రోజులు). ఇంతకుముందు ఆఫ్ఘనిస్థాన్ మాజీ కెప్టెన్ మహ్మద్ నబీ కుమారుడు హసన్ ఐసాఖిల్ (15 సంవత్సరాల 360 రోజులు) రికార్డును బ్రేక్ చేశాడు.
- ఐపీఎల్‌లో అతి పిన్న వయసులో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న ఆటగాడిగా సూర్యవంశీ
- రాజస్థాన్ రాయల్స్ తరఫున వేగవంతమైన శతకం కూడా వైభవ్‌దే