Chandrababu Naidu: అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభ వేడుకకు రాజధాని ప్రాంత రైతులకు చంద్రబాబు ఆహ్వానం

Chandrababu Naidu Invites Amaravati Farmers
  • మే 2న ప్రధాని మోదీ చేతుల మీదుగా రాజధాని అమరావతి పనుల పునః ప్రారంభం
  • రాష్ట్ర చరిత్రలో మే 2 కీలక మలుపు అవుతుందన్న సీఎం చంద్రబాబు
  • రిటర్నబుల్ ప్లాట్లకు బ్యాంకుల నుంచి రుణాల మంజూరుకు సీఎం హామీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా మే 2వ తేదీన రాజధాని అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభోత్సవం జరగనున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో రాజధాని ప్రాంత రైతులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ఆహ్వానించారు. మే 2వ తేదీ రాష్ట్ర చరిత్రలో ఒక కీలక మలుపు అవుతుందని, రాజధాని నిర్మాణం రాష్ట్ర అభివృద్ధిలో ఒక ముఖ్యమైన అడుగు అవుతుందని సీఎం అన్నారు.

రాజధాని రైతుల త్యాగం కారణంగానే నేడు ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం జరుగుతోందని ఆయన అన్నారు. రైతుల మంచి మనస్సును ఎప్పటికీ రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకుంటారని పేర్కొన్నారు. రాజధానిలో జరిగే ప్రతి కార్యక్రమం, పనులలో భాగస్వామ్యం కావాలని రాజధాని గ్రామాల రైతులను సీఎం చంద్రబాబు ఆహ్వానించారు.

ఉండవల్లిలోని నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సోమవారం రాజధాని పరిధిలోని వివిధ గ్రామాల రైతులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై రైతులతో సీఎం చర్చించారు. ల్యాండ్ పూలింగ్‌లో రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం తిరిగి కేటాయించే ప్లాట్లకు బ్యాంకుల నుంచి రుణాలు పొందేందుకు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. 
Chandrababu Naidu
Amaravati
Andhra Pradesh
Farmers
Land Pooling
Modi
Rajdhani
Development
Agriculture
Loan

More Telugu News