Chippigirigari Lakshminarayana: చిప్పగిరి లక్ష్మీనారాయణ హత్య తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది: షర్మిల
- ఆలూరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి చిప్పగిరి లక్ష్మీనారాయణ హత్య
- ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల స్పందన
- లారీతో ఢీకొట్టి, వేటకొడవళ్లతో నరికి చంపడం దారుణమని ఆవేదన
- రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలకు ఇది నిదర్శనమని వ్యాఖ్య
- ఘటనపై అత్యున్నత స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చిప్పగిరి లక్ష్మీనారాయణ హత్యకు గురికావడం పట్ల ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దారుణ ఘటనపై ఆమె తీవ్రంగా స్పందిస్తూ, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై తీవ్ర ఆందోళన వెలిబుచ్చారు.
లక్ష్మీనారాయణను అత్యంత కిరాతకంగా లారీతో ఢీ కొట్టించి, ఆపై వేట కొడవళ్లతో నరికి చంపడం చూస్తుంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత దారుణంగా పడిపోయాయో అర్థమవుతోందని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతటి దారుణమైన రీతిలో ఒక రాజకీయ నాయకుడిని హత్య చేయడం సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆమె అన్నారు.
ఈ హత్యోదంతంపై పోలీసు శాఖ తక్షణమే స్పందించి, అత్యున్నత స్థాయి విచారణ చేపట్టాలని షర్మిల డిమాండ్ చేశారు. ఈ ఘాతుకానికి పాల్పడిన అసలు నిందితులను త్వరితగతిన గుర్తించి, వారికి చట్టప్రకారం కఠిన శిక్షలు పడేలా చూడాలని ఆమె పోలీసు యంత్రాంగాన్ని కోరారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆమె నొక్కి చెప్పారు.
ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు షర్మిల పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ లక్ష్మీనారాయణ కుటుంబానికి అండగా నిలుస్తుందని, వారికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని ఆమె భరోసా ఇచ్చారు. ఈ మేరకు షర్మిల సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తన పోస్టుకు ఏపీ పోలీస్, చంద్రబాబు, పవన్ కల్యాణ్ లను ట్యాగ్ చేశారు.