Pawan Kalyan: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో తమిళనాడు నేత రాధాకృష్ణన్ భేటీ ..‘కరుంగాలి కంబు’ బహుకరణ

Pawan Kalyan Meets Tamil Nadu Leader KS Radhakrishnan
  • పవన్ కల్యాణ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన తమిళనాడు నేత రాధాకృష్ణన్
  • పర్యావరణ పరిరక్షణ పోరాటాలను పవన్‌తో పంచుకున్న రాధాకృష్ణన్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో తమిళనాడుకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు, రచయిత, పర్యావరణ పోరాట నేత కె.ఎస్. రాధాకృష్ణన్ శనివారం మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా వర్తమాన తమిళనాడు రాజకీయాలు, భాషా సంస్కృతి, పర్యావరణ పరిరక్షణ సంబంధిత అంశాలపై చర్చించారు. పర్యావరణ పరమైన విషయాల్లో, రైతాంగ పోరాటం, కన్నగి ఆలయం విషయమై కేరళ ప్రభుత్వంతో సాగిన న్యాయ పోరాటంలో తన పాత్రను రాధాకృష్ణన్ పవన్‌కు తెలియజేశారు.

పశ్చిమ కనుమలలో పర్యావరణ పరిరక్షణకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో చేసిన పోరాటాన్ని వివరించారు. ఈ సందర్భంగా రాజకీయంగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత కరుణానిధి, నెడుమారన్, ఈవీకే సంపత్ లాంటి నాయకులతో ఉన్న అనుబంధాన్ని ఆయన ప్రస్తావించారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌ను సత్కరించి ‘కరుంగాలి కంబు’ను రాధాకృష్ణన్ బహుకరించారు. కరుంగాలి కంబుకి ఇరువైపులా పవిత్రమైన పంచలోహాలతో కూడిన క్యాప్స్ ఉంటాయని ఆయన తెలిపారు. కాగా, ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 
Pawan Kalyan
KS Radhakrishnan
Tamil Nadu Politics
Environmental Activism
Andhra Pradesh
Karnataka
National Green Tribunal
Karunganni Kambhu
Tamil Culture
Kerala

More Telugu News