Shekhar Master: ఆ అమ్మాయితో నాకు ఎలాంటి సంబంధం లేదు: రూమర్లపై శేఖర్ మాస్టర్ స్పందన

Shekhar Master Denies Rumors of Relationship with Janu Liri
  • డ్యాన్స్ షోలో ఫోక్ డ్యాన్సర్ జాను లిరిని ప్రశంసలతో ముంచెత్తిన శేఖర్ మాస్టర్
  • జాను విజేతగా నిలవడంతో శేఖర్ మాస్టర్‌తో ఏదో ఉందంటూ సోషల్ మీడియాలో రూమర్స్
  • రూమర్స్‌పై తాజాగా స్పందించిన శేఖర్ మాస్టర్
  • డ్యాన్స్ షో‌లో కేవలం ట్యాలెంట్ చూసి ఎంకరేజ్ చేస్తానని వెల్లడి
ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఓ డ్యాన్స్ షోకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తుండగా, ఆ షోలో విజేతగా నిలిచిన జాను లిరితో ఆయనకు ఏదో సంబంధం ఉందంటూ ఇటీవల సోషల్ మీడియాలో పుకార్లు వ్యాపించాయి. డ్యాన్స్ షోలో ఫోక్ డ్యాన్సర్ జాను లిరిని శేఖర్ మాస్టర్ ప్రశంసలతో ముంచెత్తడంతో వీరి మధ్య సంబంధం ఉందనే రూమర్లు అధికమయ్యాయి. శేఖర్ మాస్టర్ అండతోనే ఆమె విజేత అయిందంటూ ప్రచారం జరిగింది.

సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్‌పై తాజాగా శేఖర్ మాస్టర్ స్పందిస్తూ దీనిపై క్లారిటీ ఇచ్చారు. తమ మధ్య ఎటువంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. తాను ఒక షోకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నానంటే చాలా నిజాయితీగా ఉండాలన్నారు. ఎన్నో ఆశలతో డ్యాన్సర్లు ఈ షోలకు వస్తారు కాబట్టి అక్కడ ప్రతిభను మాత్రమే చూడాలన్నారు.

జాను అనే అమ్మాయి అందరికంటే చాలా ప్రత్యేకంగా డ్యాన్స్ చేసిందని తనకు అనిపించిందన్నారు. అందుకే తాను ఆమెను ప్రోత్సహించానని, ప్రతిభ కనబర్చిన ఎవరినైనా అలాగే ప్రోత్సహిస్తానని చెప్పారు. ఆమె కష్టపడి డ్యాన్స్ చేసింది కాబట్టే విజేత అయిందని, అందులో తాను చేసింది ఏమీ లేదన్నారు. గతంలో కూడా తనపై ఇలాంటి రూమర్స్ వచ్చాయని, కానీ తాను వాటిని పట్టించుకోనని పేర్కొన్నారు. తాను డ్యాన్స్ షోలలో కేవలం ప్రతిభ ఉన్న వారిని మాత్రమే ప్రోత్సహిస్తాను కాబట్టే న్యాయనిర్ణేతగా నిర్వాహకులు ఆహ్వానిస్తున్నారని చెప్పారు. 
Shekhar Master
Janu Liri
Dance Show Judge
Dance Show Winner
Social Media Rumors
Relationship Rumors
Celebrity Gossip
Folk Dancer
Choreographer

More Telugu News