రేపటిలోగా వెళ్లిపోవాలంటూ.. హైదరాబాద్‌లో నలుగురు పాకిస్థానీలకు నోటీసులు
తాజాగా హైదరాబాద్‌లో ఉంటున్న నలుగురు పాక్ పౌరులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. వీరు షార్ట్ వీసాలతో ఉంటున్నట్లు గుర్తించారు. రేపటిలోగా హైదరాబాద్ విడిచి వెళ్లిపోవాలంటూ ఆదేశించారు. కాగా, భాగ్యనగరంలో మొత్తం 213 మంది పాకిస్థానీయులు ఉన్నట్లు పోలీసుల తనిఖీల్లో తేలింది.