Sunrisers Hyderabad: చెన్నైని ఓడించి చరిత్ర సృష్టించిన హైదరాబాద్

Sunrisers Hyderabad Create History Beat Chennai Super Kings in Chennai
  • గత రాత్రి చెన్నైలోని చెపాక్ స్టేడియంలో హైదరాబాద్‌తో పోటీపడిన చెన్నై
  • చెన్నైలో హైదరాబాద్‌ చేతిలో సీఎస్‌కే ఓడిపోవడం ఇదే తొలిసారి
  • ప్లే ఆఫ్స్ ఆశలు కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్
ఐపీఎల్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో గత రాత్రి జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో హైదరాబాద్ ఖాతాలో ఓ రికార్డు వచ్చి చేరింది. సీఎస్‌కేను సొంత గడ్డపై ఓడించడం హైదరాబాద్‌కు ఇదే తొలిసారి. ఐపీఎల్ ప్రారంభమైన తర్వాత చెన్నై జట్టు సొంతగడ్డపై హైదరాబాద్‌ చేతిలో ఎప్పుడూ ఓడిపోలేదు. గత రాత్రి మాత్రం పరాభవం తప్పలేదు. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ మరో బంతి మిగిలి ఉండగానే 154 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టులో డెవాల్డ్ బ్రెవిస్ చేసిన 42 పరుగులే అత్యధికం. అనంతరం 155 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన హైదరాబాద్ 18.4 ఓవర్లలో 5 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఇషాన్ కిషన్ 44, కమిందు మెండిస్ 32 పరుగులు చేశారు. ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన చెన్నై 7 పరాజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచి ప్లే ఆఫ్స్ ఆశలు కోల్పోయింది. మరోవైపు, ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన సన్ రైజర్స్ హైదరాబాద్ 9 మ్యాచుల్లో 3 విజయాలతో 8వ స్థానంలో ఉంది.
Sunrisers Hyderabad
Chennai Super Kings
IPL 2023
Chepauk Stadium
Ishan Kishan
Kamindu Mendis
Devald Brevis
Hyderabad wins
CSK defeat
IPL

More Telugu News