Vijayawada Police: విజయవాడలో ఉగ్రవాదుల కదలికలు.. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు

Vijayawada Police Launch Search Operation Following Terrorist Threat
--
ఉగ్రవాదుల కదలికలకు సంబంధించిన సమాచారంతో ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో కలకలం రేగింది. నగరంలో నలుగురు సిమి సానుభూతిపరులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకునేందుకు నగరంలోని పలు ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఉగ్రవాదుల కదలికలకు సంబంధించి కేంద్ర నిఘా వర్గాలు రెండు నెలల క్రితమే పోలీసులను హెచ్చరించినట్లు తెలుస్తోంది. 

తాజాగా శుక్రవారం విజయవాడ పోలీసులు గొల్లపూడి, అశోక్ నగర్, లబ్బీపేటలో గాలిస్తున్నారు. పహల్గామ్ లో ఉగ్రదాడి తర్వాత దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తత ప్రకటించింది. వివిధ నగరాల్లో ఉగ్రవాదుల కదలికలు, ఉగ్రవాదుల సానుభూతిపరుల కోసం పోలీసులు ముమ్మరంగా సోదాలు చేస్తున్నారు.
Vijayawada Police
SIMI
Terrorist Activities
Vijayawada
Andhra Pradesh
Counter-terrorism
Security Alert
Police Raids
India Terrorism

More Telugu News