కోనేరు హంపి ఖాతాలో ఫిడే టైటిల్
- అత్యుత్తమ టై బ్రేక్ ఆధారంగా టోర్నీ విజేతగా నిలిచిన కోనేరు హంపి
- పుణె వేదికగా ఫిడే ఉమెన్స్ గ్రాండ్ ఫి చెస్ టోర్నమెంట్
ఫైనల్ రౌండ్‌లో కోనేరు హంపి బల్గేరియాకు చెందిన సుర్గుయిల్ సలిమావాపై 1-0 తేడాతో గెలుపొందారు. మరోపక్క జు జినర్ కూడా రష్యాకు చెందిన పొలినా షువలోవాపై విజయం సాధించడంతో వీరిద్దరూ మొదటి స్థానంతో ముగించారు. అయితే, ఉత్తమ టై-బ్రేక్ ఆధారంగా హంపి టైటిల్ విజేతగా నిలిచారు.
మరో తెలుగమ్మాయి ద్రోణవల్లి హారిక మంగోలియా క్రీడాకారిణి ముంగంతూర్ బత్ఖుయాగ్‌తో, వైశాలి జార్జియా క్రీడాకారిణి సలోమ్ మెలియాతో, దివ్య దేశ్‌ముఖ్ రష్యాకు చెందిన ఎలీనా కాష్లిన్‌స్కాయాతో తమ గేమ్‌లను డ్రాగా ముగించారు.