సొంతూరికి వచ్చిన రామ్ చరణ్ డైరెక్టర్

Ram Charans Director Buchi Babu Sana Visits Hometown
  • కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి గ్రామానికి వచ్చిన బుచ్చిబాబు సానా
  • తండ్రి సంవత్సరీకం కార్యక్రమంలో పాల్గొన్న వైనం
  • బుచ్చిబాబు రాకతో గ్రామంలో సందడి 
ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో 'పెద్ది' పేరుతో ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న దర్శకుడు బుచ్చిబాబు సానా చాన్నాళ్ల తర్వాత సొంతూరికి వచ్చారు. కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి గ్రామంలో ఆయన తన తండ్రి సంవత్సరీకం కార్యక్రమానికి హాజరయ్యారు. ఆచారాల ప్రకారం కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి సంవత్సరీకం క్రతువులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు భారీ ఎత్తున భోజన కార్యక్రమం నిర్వహించారు. 

బుచ్చిబాబు సానా తండ్రి వెంకట్రావు గతేడాది జూన్ లో మరణించారు. అయితే, తిథి ప్రకారం ఇవాళ సంవత్సరీకం నిర్వహించారు. చాన్నాళ్ల తర్వాత బుచ్చిబాబు సొంతూరికి రావడంతో యు.కొత్తపల్లి గ్రామంలో సందడి నెలకొంది.
Go Back to Shorts
Buchi Babu Sana
Ram Charan
Pedda Movie Director
U. Kottapalle
Kakinada
Telugu Film Industry
Film Director's Visit
Family Event
Annual Ceremony

More Telugu News