ఝార్ఖండ్ లో భారీ ఎన్ కౌంటర్.. పెద్ద సంఖ్యలో మావోలు మృతి

Jharkhand Maoist Encounter Eight Killed in Gunfight
మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటివరకు చత్తీస్ గఢ్ లో వరుస ఎన్ కౌంటర్లు జరిగితే... తాజాగా ఇప్పుడు ఝార్ఖండ్ కి సీన్ మారింది. ఝార్ఖండ్ లోని బొకారో జిల్లా లాల్పానియా ప్రాంతంలోని 'లుగు' కొండల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఉదయం నుంచి ఆ ప్రాంతంలో కాల్పులు కొనసాగుతున్నాయి. సీఆర్పీఎఫ్ తో కలిసి రాష్ట్ర పోలీసులు నిర్వహించిన సంయుక్త ఆపరేషన్ లో ఎనిమిది మంది మావోయిస్టులు హతమయ్యారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్టు సమాచారం. 

ఎన్ కౌంటర్ జరిగిన ఘటనాస్థలి నుంచి ఎస్ఎల్ఆర్, ఇన్సాస్, రైఫిల్స్ వంటి పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్న బలగాలు వాటిని అక్కడి నుంచి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మావోయిస్టుల ఉనికి లేకుండా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మావోయిస్టులందరూ లొంగిపోవాలని... లేకపోతే ప్రాణాలతో మిగిలి ఉండరని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హెచ్చరించిన సంగతి విదితమే. ఈ ఎన్ కౌంటర్ కు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Go Back to Shorts
Maoists
Jharkhand Encounter
Bokaro
Lalpania
CRPF
Indian Police
Naxalites
Anti-Naxal Operation
Amit Shah

More Telugu News