JD Vance: భార‌తీయ సంప్ర‌దాయ దుస్తుల్లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పిల్ల‌లు.. ఇదిగో వీడియో!

JD Vances Children in Traditional Indian Attire During India Visit
   
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ త‌న కుటుంబంతో క‌లిసి భారత పర్యటనకు వచ్చిన విష‌యం తెలిసిందే. ఈ రోజు ఉద‌యం వారి విమానం ఢిల్లీలోని పాలం టెక్నికల్ ఏరియాలో ల్యాండ్ అయింది. అక్క‌డ‌ వారికి ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. ఈ సంద‌ర్భంగా అమెరికా ఉపాధ్య‌క్షుడి పిల్ల‌ల వ‌స్త్ర‌ధార‌ణ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. 

వారి ఇద్ద‌రు కుమారులు, కూతురు భార‌తీయ సంప్ర‌దాయ దుస్తుల్లో క‌నిపించారు. భార‌తీయ సంప్ర‌దాయం ఉట్టిప‌డేలా కుమారులు ఇద్ద‌రు కుర్తా, పైజామా ధ‌రించ‌గా... కూతురు అనార్క‌లి స్టైల్‌లో రూపొందించిన ఫుల్ లెంగ్త్ డ్రెస్సులో క‌నిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఇక‌, జేడీ వాన్స్ నాలుగు రోజుల పాటు భారత్ లో పర్యటించ‌నున్న విష‌యం తెలిసిందే. ఇవాళ మొద‌ట ఆయ‌న ప్ర‌ధాని మోదీతో భేటీ కానున్నారు. 

కాగా, వాన్స్ అర్ధాంగి ఉషా వాన్స్ భారత సంతతికి చెందిన మహిళ అనే సంగ‌తి తెలిసిందే. వాన్స్ తన కుటుంబంతో కలిసి జైపూర్, ఆగ్రాలను సందర్శించ‌నున్నారు. మంగళవారం జైపూర్‌లోని ప్రసిద్ధ అమెర్ ప్యాలెస్‌ను, బుధవారం ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను సందర్శించనున్నారు.  
JD Vance
US Vice President
India Visit
Traditional Indian Clothes
Family
Viral Video
Jaipur
Agra
Amer Palace
Taj Mahal

More Telugu News