Visakha Sri Sarada Peetham: తిరుమ‌ల‌లోని విశాఖ‌ శార‌దా పీఠం మ‌ఠానికి నోటీసులు

Visakha Sri Sarada Peetham in Tirumala Receives Notice for Illegal Construction
  • తిరుమ‌ల‌లో టీటీడీ నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా విశాఖ‌ శార‌దా పీఠం వారి భ‌వ‌న నిర్మాణం
  • ఈ అక్ర‌మ నిర్మాణంపై హైకోర్టును ఆశ్ర‌యించిన హిందూ ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణ సంఘాలు 
  • విచార‌ణ జ‌రిపిన ఏపీ హైకోర్టు తాజాగా టీటీడీకి అనుకూలంగా తీర్పు
  • ఈ నేప‌థ్యంలో విశాఖ‌ శార‌దా పీఠం మ‌ఠానికి ఈరోజు టీటీడీ నోటీసులు
తిరుమ‌ల‌లోని విశాఖ‌ శార‌దా పీఠం మ‌ఠానికి షాక్ త‌గిలింది. తిరుమ‌ల‌లో ఈ పీఠం వారు టీటీడీ నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఒక భ‌వ‌నం నిర్మించారు. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో ఈ భ‌వ‌న నిర్మాణం జ‌రిగింది. ఈ అక్ర‌మ నిర్మాణంపై హిందూ ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణ సంఘాలు హైకోర్టును ఆశ్ర‌యించాయి. ఈ విష‌య‌మై విచార‌ణ జ‌రిపిన ఏపీ హైకోర్టు టీటీడీకి అనుకూలంగా తీర్పును వెల్ల‌డించింది. 

దీంతో ఈ భ‌వ‌నాన్ని టీటీడీ స్వాధీనం చేసుకునేందుకు చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించింది. అక్ర‌మ నిర్మాణాల‌కు సంబంధించి నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘిస్తే ఆ నిర్మాణాల‌ను కూల్చి వేయాల‌ని న్యాయ‌స్థానం పేర్కొంది. ఈ తీర్పుతో తాజాగా విశాఖ‌ శార‌దా పీఠం వారు నిర్మించిన మ‌ఠానికి ఈరోజు టీటీడీ నోటీసులు జారీ చేసింది. ప‌దిహేను రోజుల్లోగా మ‌ఠం ఖాళీ చేసి వెళ్లిపోవాల‌ని, అలాగే ఆ భ‌వ‌నాన్ని త‌మ‌కు అప్ప‌గించాల‌ని టీటీడీ ఎస్టేట్ నోటీసుల్లో పేర్కొంది. 
Visakha Sri Sarada Peetham
Tirumala
TTD
Illegal Construction
AP High Court
Notice
Hindu Dharma Parirakshana Sanghams
Temple
Building Demolition
Andhra Pradesh

More Telugu News