Kusum Pharmaceuticals: భారత ఔషధ కంపెనీ గోదాంపై దాడి.. రష్యా, ఉక్రెయిన్ ఎంబసీల మాటల యుద్ధం

Indian Pharma Warehouse Attacked in Kyiv Russia and Ukraine Trade Accusations
  • కీవ్‌లోని భారతీయ ఔషధ కంపెనీ గోదాంపై క్షిపణి దాడి
  • ఉక్రెయిన్ క్షిపణి పడి ఉండవచ్చన్న భారత్‌లోని రష్యా రాయబార కార్యాలయం
  • ఉగ్రవాదాన్ని సమర్థించుకునే చర్య సరికాదన్న ఉక్రెయిన్ ఎంబసీ
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని ఒక భారతీయ ఔషధ కంపెనీ గోదాంపై ఇటీవల క్షిపణి దాడి జరిగింది. ఈ దాడికి సంబంధించి కీవ్‌లోని ప్రాసిక్యూటర్ జనరల్ క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై రష్యా, ఉక్రెయిన్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

ఈ దాడి తమ పని కాదని, అది ఉక్రెయిన్ క్షిపణి అయి ఉండవచ్చని భారత్‌లోని రష్యా కార్యాలయం ప్రకటించింది.

ఈ ప్రకటనపై ఢిల్లీలోని ఉక్రెయిన్ ఎంబసీ స్పందించింది. ఉగ్రవాదాన్ని సమర్థించుకునే చర్య సరికాదని, ఒక సీనియర్ నేరస్థుడు ఎప్పుడూ తన నేరాలను అంగీకరించడని వ్యాఖ్యానించింది. రష్యా చేస్తోన్న వాదనలో ఎలాంటి విశ్వసనీయత లేదని పేర్కొంది. ఈ క్షిపణి దాడులు పొరపాటున జరిగాయని మాస్కో వాదిస్తోందని, దీనిని అమెరికా కూడా నమ్ముతోందని ఉక్రెయిన్ రాయబార కార్యాలయం పేర్కొంది.

కుసుమ్ అనే కంపెనీకి చెందిన ఫార్మా గిడ్డంగిపై కొద్ది రోజుల క్రితం దాడి జరిగింది. రష్యా ఉద్దేశపూర్వకంగానే భారతీయ కంపెనీలను లక్ష్యంగా చేసుకుంటోందని ఉక్రెయిన్ రాయబార కార్యాలయం ఆరోపించింది. పిల్లలు, వృద్ధుల కోసం ఔషధాలు నిల్వ చేసిన గోదాంలపై దాడులు చేస్తోందని ఆరోపించింది. భారత్‌తో స్నేహం ఉందని చెబుతూనే రష్యా ఇలా దాడులు చేయడం సరికాదని వ్యాఖ్యానించింది.

ఉక్రెయిన్ రాయబార కార్యాలయం చేసిన వ్యాఖ్యలపై రష్యా రాయబార కార్యాలయం కూడా స్పందించింది. భారత్‌కు చెందిన ఫార్మా గోదాంపై రష్యా సాయుధ బలగాలు దాడి చేయలేదని స్పష్టం చేసింది.
Kusum Pharmaceuticals
Ukraine
Russia
missile attack
India
Kyiv
Embassy dispute
Pharmaceutical warehouse
International relations
Ukraine-Russia conflict

More Telugu News