Elon Musk: తన సంతానంతో సైన్యం సృష్టిస్తాడట.. ఎలాన్ మస్క్​ పై వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం

Elon Musks Legion of Children The Wall Street Journal Report
  • మస్క్ పితృత్వంపై వివాదాస్పద నివేదిక
  • జపాన్ ఉన్నత వర్గానికి చెందిన మహిళకు వీర్యదానం
  • 'పిల్లల సైన్యం' కావాలని ప్రయత్నిస్తున్న ప్రపంచ కుబేరుడు
  • ఇప్పటికే నలుగురు మహిళలతో 14 మంది పిల్లలు
ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ 'పిల్లల సైన్యం' (లెజియన్) నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇందుకోసం తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ ద్వారా తల్లులను వెతుకుతున్నారని 'ది వాల్ స్ట్రీట్ జర్నల్' (డబ్ల్యూఎస్‌జే) ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది.
ఇప్పటికే నలుగురు మహిళల ద్వారా మస్క్‌కు 14 మంది పిల్లలు ఉన్నారు. గాయని గ్రిమ్స్, న్యూరాలింక్ ఎగ్జిక్యూటివ్ శివోన్ జిలిస్, మాజీ భార్య జస్టిన్, కన్జర్వేటివ్ ఇన్‌ఫ్లుయెన్సర్ యాష్లే సెయింట్ క్లెయిర్ ల ద్వారా మస్క్ ఈ సంతానాన్ని పొందారు. తనకు పద్నాలుగు మంది పిల్లలు ఉన్నారని మస్క్ ఇటీవల వెల్లడించారు. అయితే, ఈ సంఖ్య ఇంకా ఎక్కువ ఉండొచ్చని మస్క్ సన్నిహిత వర్గాలు భావిస్తున్నట్లు కథనం పేర్కొంది.

యుగాంతంలోపు 'లెజియన్-స్థాయి' పిల్లలు కావాలని మస్క్ తనతో చెప్పినట్లు క్లెయిర్ చెప్పారట. కాగా, జపాన్ కు చెందిన ఉన్నత వర్గానికి చెందిన ఓ మహిళ కోరడంతో మస్క్ వీర్యదానం చేసినట్లు ఈ కథనం వెల్లడించింది. పిల్లల తల్లులను ఆర్థిక ప్రయోజనాలు, కఠినమైన గోప్యతా ఒప్పందాల ద్వారా మస్క్ నియంత్రిస్తున్నారని కొందరు మహిళలు ఆరోపించినట్లు నివేదిక తెలిపింది. పిల్లాడి తండ్రి పేరును రహస్యంగా ఉంచితే తనకు 15 మిలియన్ డాలర్లతో పాటు నెలనెలా లక్ష డాలర్లు ఇస్తానని మస్క్ హామీ ఇచ్చారని క్లెయిర్ తెలిపారు.

మస్క్ పేరును బహిర్గతం చేశాక నెలకు 40 వేల డాలర్లకు తగ్గించారని, వాల్ స్ట్రీట్ జర్నల్ పరిశోధన మొదలుపెట్టడంతో 20 వేల డాలర్లకు తగ్గించారని వివరించారు. శివోన్ జిలిస్‌కు మాత్రం తల్లులందరిలో 'ప్రత్యేక హోదా' ఉన్నట్లు, ఆమె మస్క్‌తో పాటు పలు ఉన్నత స్థాయి సమావేశాలకు హాజరైనట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా జననాల రేటు తగ్గడం మానవాళి మనుగడకు ప్రమాదకరమని మస్క్ బలంగా నమ్ముతారని, నాగరికతను కాపాడాలంటే తెలివైన వారు ఎక్కువ మంది పిల్లల్ని కనాలని ఆయన తరచూ చెబుతుంటారని, ఈ నమ్మకమే ఆయన అధిక సంతానం కోరుకోవడానికి కారణమని డబ్ల్యూఎస్‌జే కథనం వివరించింది.
Elon Musk
Elon Musk children
Wall Street Journal
Elon Musk family
Grimes
Shivon Zilis
Ashley Saint Claire
Justin Wilson
Legions of children
X (formerly Twitter)

More Telugu News